నవీన్ చంద్ర హీరోగా నటించిన భానుమతి రామకృష్ణ ట్రైలర్ కు విశేషాదరణ
- May 26, 2020
విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఈమేజ్ తెచ్చుకున్న నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన సినిమా భానుమతి రామకృష్ణ. ఈ సినిమాలో నవీన్ సరసన సలోని లూత్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్ ఫిల్మ్ గా భానుమతి రామకృష్ఱ రూపొందించడం జరిగింది. ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకుడు. న్యాచురాలిటీ కోసం ఈ సినిమాలో కీలక సన్నివేశాల్ని గొరిల్లా పద్ధతిలో షూట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కు ఆన్ లైన్ లో ఆదరణ లభిస్తోంది. ముప్పై ఏళ్లు దాటిన ఓ యువతి యువకుడు మధ్య జరిగే ప్రేమ వ్యవహారమే ఈ సినిమాకు ముఖ్య కథాంశమని దర్శకుడ శ్రీకాంత్ నాగోతి తెలిపారు. ఫుల్ ఎంటర్ టైనింగ్ గా డిజిటిల్ ఆడియెన్స్ కి నచ్చే రీతిన ఈ సినిమా సాగిపోతుందని నిర్మాత యశ్వంత్ ములకుట్ల అన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు అధికారికంగా ప్రకటిస్తామని యశ్వంత్ తెలిపారు.
నటీనటులు
నవీన్ చంద్ర, సలోని లూత్రా, హార్ష తదితరులు
సాంకేతిక వర్గం
దర్శకత్వం - శ్రీకాంత్ నాగోతి
ప్రొడ్యూసర్ - యశ్వంత్ ములుకుట్ల
మ్యూజిక్ - శ్రవన్ భరద్వజ్
సినిమాటోగ్రాఫర్ - సాయిప్రకాశ్
ఎడిటర్ - రవికాంత్ పేరేపు
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







