విదేశాల నుంచి వచ్చేవారి క్వారంటైన్ డబ్బులు వాపస్

- May 26, 2020 , by Maagulf
విదేశాల నుంచి వచ్చేవారి క్వారంటైన్ డబ్బులు వాపస్

న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌లో అడుగుపెట్టేవారు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.విదేశాల నుంచి వచ్చేవారు తొలి ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో, మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.

విదేశాల నుండి తిరిగి వచ్చిన వారు రోజుల నిర్బంధంకు గాను అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంది. కానీ, తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 14 రోజుల నిర్బంధంలో  ఏడు రోజులు హోటల్ లో మరో ఏడు రోజులు ఇంటి వద్దనే నిర్బంధానికి అనుమతిస్తున్నందున కట్టిన డబ్బులో 7 రోజుల రుసుము వాపసు ఇవ్వాలని హోటల్ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. కొన్ని హోటళ్లు దీనికి నిరాకరించాయని ప్రభుత్వం దృష్టికి రాగా, ఆలస్యం చేయకుండా వారి బ్యాలెన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని హోటళ్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com