ఈద్ నాడు అపశృతి..తెలంగాణ వాసి దారుణ హత్య
- May 27, 2020
షార్జా: షార్జాలో ఈద్ రోజున అపశృతి జరిగింది. స్వదేశీయుడిని పొడిచి చంపినందుకు 35 ఏళ్ల భారతీయ ప్రవాసిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేశవేని నవీన్(27) అనే వ్యక్తి ఆరు నెలల క్రితం ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని దేశం కాని దేశం అయిన యూఏఈ వచ్చాడు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఓ కార్ వాషింగ్ సెంటర్‌లో పనికి కుదిరాడు. కానీ అంతలోనే విధి వక్రించి దారుణ హత్యకు గురయ్యాడు.
అసలేం జరిగిందంటే, పోలీసులు ఈద్ అల్ ఫితర్ ఆనందంలో ఉండగా వచ్చిన ఫోన్ కాల్ తో అప్రమత్తమయ్యారు. నవీన్ తన తోటి కార్మికుడు అయిన 35 ఏళ్ల భారతీయ వాసితో వ్యక్తిగత సమస్యలపై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో నిందితుడు కత్తిని పట్టుకుని, నవీన్ ను పలుసార్లు పొడిచి చంపాడని షార్జా పోలీసులు తెలిపారు. పోలీసులు నేరం జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, నవీన్ చనిపోయినట్లు గుర్తించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించగా, అతన్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్టు తెలిపిన పోలీసులు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







