ఉల్లంఘనలు: సివిల్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సుల స్వాధీనం
- May 27, 2020
కువైట్ సిటీ: ఫర్వానియా సెక్యూరిటీ సిబ్బంది, ఉల్లంఘనలకు పాల్పడిన కువైటీల డ్రైవింగ్ లైసెన్సులు, సివిల్ ఐడీలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈద్ అల్ ఫితర్ సెలవుల తొలి రోజున కర్‌ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు. గవర్నరేట్‌లోని పలు ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముందే హెచ్చరించిన అధికారులు, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో కువైట్ వ్యాప్తంగా కర్‌ఫ్యూ అమలవుతోంది. ఉల్లంఘనలకు పాల్పడ్డవారిలో చిన్నారులు కూడా వున్నారు. వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు అధికారులు.
తాజా వార్తలు
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్







