ఈద్ సెలవుల్లో ఉల్లంఘనులపై ఉక్కుపాదం
- May 27, 2020
మస్కట్: ఒమన్ వ్యాప్తంగా ఈద్ సెలవుల నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాయల్ ఒమన్ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సుప్రీం కమిటీ డైరెక్షన్స్‌ని ప్రతి ఒక్కరూ పాటించాలనీ, ప్రత్యేక సందర్భాలను అనుసరించి కొన్ని వెసులుబాట్లు కల్పించిన దరిమిలా, వాటిని అడ్డం పెట్టుకుని ఉల్లంఘనలకు పాల్పడటం సబబు కాదని పోలీస్ అధికారులు అంటున్నారు. ఒమన్‌కి చెందిన 11 గవర్నరేట్స్ పరిధిలో మాస్క్‌లు ధరించనివారిపై చర్యలు తీసుకుంటున్నారు. కాగా, మస్కట్‌లో 40 మంది వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘలా ఇండస్ట్రియల్ ఏరియాలో సామూహిక ఈద్ ప్రార్థనలు నిర్వహించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. కాగా, మరో 34 మంది వలసదారుల్ని అల్ అన్సాబ్ ఏరియాలో అరెస్ట్ చేశారు. నార్త్ అల్ షర్కియాలోనూ, అల్ దఖ్లియాలోనూ ఇదే తరహాలో పెద్ద సంఖ్యలో వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తనిఖీలు విస్తృతంగా జరుగుతున్న దరిమిలా, ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని రాయల్ ఒమన్ పోలీస్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?