వెంకీ రానా హీరోలుగా మల్టీస్టార్రర్..మలయాళం చిత్రం రీమేక్
- May 27, 2020
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’కు సంబందించిన తెలుగు రీమేక్ రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమాను తెలుగులో బాలయ్య, రానా ప్రధాన పాత్రల్లో నిర్మించాలని భావించారు. అయితే ఏవో కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాలో నటించడంపై ఆసక్తి చూపించలేదట. దీంతో బాలయ్య పాత్రలో వెంకటేష్ ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తునట్లు తాజా సమాచారం. అంతేకాదు ఈ రీమేక్‌లో నటించడానికి ఇప్పటికే వెంకటేష్, రానాలు ఇంట్రస్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ గురించి మాట్లాడితే.. అయ్యప్పన్ కోషియమ్‌లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో వెంకటేష్ చేయనున్నాడు. పృథ్విరాజ్ పాత్రలో రానా నటిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలను, సినిమాలో పనిచేసే మిగితా టెక్నికల్ సిబ్బంది గురించి తెలుగు రీమేక్ హక్కులన నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం అతి త్వరలో వెల్లడించనున్నాడు. సూర్య దేవర నాగవంశీ ప్రస్తుతం రంగ్ దే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







