బహ్రెయిన్:11 ప్రైవేట్ ఆస్పత్రులకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల నిర్వహణకు అనుమతి

బహ్రెయిన్:11 ప్రైవేట్ ఆస్పత్రులకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల నిర్వహణకు అనుమతి

మనామా:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు కీలకమైన వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియ మరింత ముమ్మరం చేసింది బహ్రెయిన్. కింగ్ డమ్ లోని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ ఆరోగ్య నియంత్రణ అధికార విభాగం అనుమతి ఇచ్చింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ సామార్ధం ఉన్నట్లు భావిస్తున్న 11 ఆస్పత్రులకు పర్మిషన్ లభించింది. పరీక్షల నిర్వహణ ఫీజును ఆస్పత్రి వర్గాలే నిర్ణయిస్తాయని..అయితే..ఫీజు మొత్తం BD40 నుంచి BD50 వరకు మాత్రమే ఉండాలని కూడా స్పష్టం చేసింది. అయితే..ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పరీక్షలు యధావిధిగానే కొనసాగుతాయని కూడా వివరించింది.

కోవిడ్ 19 పరీక్షలు నిర్వహణకు అనుమతి పొందిన 11 ఆస్పత్రుల వివరాలు...
మిడిల్ ఈస్ట్ హస్పిటల్, అమెరికన్ మిషన్ హస్పిటల్, అవాలి హస్పిటల్, అల్ కింది స్పెషలిస్ట్ హస్పిటల్, రాయల్ బహ్రెయిన్ హస్పిటల్, ఎల్బీఎన్ అల్ నఫీస్ హస్పిటల్, బహ్రెయిన్ స్పెషలిస్ట్ హస్పిటల్, డాక్టర్ తారీఖ్ హస్పిటల్, నూర్ స్పెషలిస్ట్ హస్పిటల్, కింగ్ అబ్దుల్లా మెడికల్ సిటి, అల్ సలమ్ స్పెషలిస్ట్ హస్పిటల్.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top