రువి, దర్సయిత్‌, వాడి కబిర్‌, హర్మియాలలో చెక్‌పోస్టులు

రువి, దర్సయిత్‌, వాడి కబిర్‌, హర్మియాలలో చెక్‌పోస్టులు

మస్కట్‌: మస్కట్‌ గవర్నరేట్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ, పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు కొనసాగుతాయి. ముట్రా, రువి, దర్సయిత్‌, వాడి కబిర్‌, హర్మియాలలో చెక్‌పోస్టులు కొనసాగుతాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ అల్‌ హాష్మి చెప్పారు. విలాయత్‌ ముట్రా ఇంకా హెల్త్‌ ఐసోలేషన్‌లోనే కొనసాగుతుందని ఆయన వివరించారు. రువి, దర్సయిత్‌, వాడి అల్‌ కబిర్‌, అల్‌ హర్మియా ప్రాంతాలు గ్రేటర్‌ ముట్రాహ్‌లో వుంటాయని ఆయన చెప్పారు. గతంలోలానే ఈ ప్రాంతాలోని వాహనదారులు చెక్‌పోస్టుల గుండా వెళ్ళాల్సి వుంటుంది. ఇతర ప్రాంతాలకు పని నిమిత్తం వెళ్ళేవారు వ్యాలీడ్‌ రీజన్‌తో వెళ్ళాల్సి వుంటుంది. రెంటల్‌ ఎగ్రిమెంట్‌ని వారు తమతోపాటు తీసుకెళ్ళక తప్పదు.

 

Back to Top