కోవిడ్ 19: ఐసోలేషన్ నుంచి కరోనా పేషెంట్ల డిశ్చార్జ్ కు కొత్త మార్గనిర్దేశకాలు

- May 28, 2020 , by Maagulf
కోవిడ్ 19: ఐసోలేషన్ నుంచి కరోనా పేషెంట్ల డిశ్చార్జ్ కు కొత్త మార్గనిర్దేశకాలు

దుబాయ్:ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జ్ కు సంబంధించి దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రకారం ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులు పూర్తి చేసుకున్న పేషెంట్లను డిశ్చార్జ్ చేయవచ్చు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నా కూడా వారిని ఇంటికి పంపిస్తారు. కరోనా వ్యాధి సోకి ఐసోలేషన్ వార్డులో చేరిన నాటి నుంచి 14 రోజుల పాటు అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు టెంపరేచర్ పరిశీలిస్తారు. వరుసగా మూడు రోజులు జ్వరం లేకుంటే మళ్లీ కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే పేషెంట్ ను ఐసోలేషన్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు. అయితే..షేషెంట్ నుంచి శాంపిల్స్ తీసుకున్ననాటి నుంచి గానీ, లక్షణాలు కనిపించిన తొలి రోజు నుంచి వరుసగా 14 రోజులను లెక్కగట్టాల్సి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com