హైదరాబాద్ లో గుడిసెల్లో పేలిన గ్యాస్ సిలిండర్లు
- May 29, 2020
హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో వలస కూలీలు వేసుకున్న గుడిసెల్లోని ఓ గుడిసెలో ఈరోజు మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పేద కూలీల గుడిసెలు మొత్తం తగలబడ్డాయి. దీంతో మరో సిలిండర్ కూడా పేలింది. అసలే ఎండలు, దానికితోడు తీవ్రమైన వడగాలి ప్రభావానికి మంటలు చెలరేగాయి. రెండు సిలిండర్లు పేలిన సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అపార్ట్‌మెంట్ల మధ్య ఉన్న గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







