ఒమన్:భారీ వర్షాలతో ఒకరు మృతి..మరొకరు గల్లంతు
- May 30, 2020
ఒమన్:ఒమన్ లో భారీ వర్షాలు కురియటంతో ఒకరు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. దోఫర్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షాల కారణంగా ఎయిన్ రజాత్ లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతైన మరో వ్యక్తి కోసం రాయల్ ఒమన్ పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. సివిల్ డిఫెన్స్ కు చెందిన పబ్లిక్ అథారిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నీటి ప్రవాహంలో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. అయితే..అందులోఐదుగురిని రక్షించగా..మరో ఇద్దరు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఓ వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. మరో వ్యక్తి ఆచూకీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







