ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య
- May 30, 2020
ప్రపంచ మానవాళికి పెను సవాలుగా మారింది కరోనా వైరస్.. కంటికి కనిపించని కల్లోల వైరస్ విజృంభిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కారణంగా రెండువందలకు పైగా దేశాలు అల్లాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య 60లక్షలకు చేరుకోవడం ఆందోళన కల్గిస్తోంది. … అగ్రదేశం అమెరికాలో కోవిడ్ ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలో మృతుల సంఖ్య 1లక్షల 3వేలకు చేరుకుంది. ఇక మొత్తం కేసులు 17లక్షల 70వేలకు పైగా నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. 4లక్షల 98వేలమంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక బ్రెజిల్లో పరిస్థితి మరి దయనీయంగా మారింది. దేశంలో కేసులు సంఖ్య 4లక్షల 38వేలు దాటాయి. మృతుల సంఖ్య 26వేలకు చేరుకున్నాయి. 1లక్ష 93వేల మంది వైరస్ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రష్యాలో పరిస్థితి అలానే కొనసాగుతోంది. దేశంలో మృతుల సంఖ్య కంట్రోల్లో ఉన్నా… పాజిటివ్ కేసులు సంఖ్య 3లక్షల 87వేలు దాటాయి. ప్రతిరోజు వేలల్లో కేసులునమోదవుతున్నాయి. 1లక్ష 59వేల మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు.
స్పెయిన్ లో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో 2లక్షల 84వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 27వేల మంది కోవిడ్ వల్ల మృత్యువాత పడ్డారు. 1లక్ష 96వేల మంది కోలుకొని ఆస్పత్రులనుంచి ఇంటికి వెళ్లారు. యూకేలో కోవిడ్ ప్రభావం అలాగే కొనసాగుతోంది. ఇప్పటివరకు 37వేలమందికిపైగా మృత్యువాతపడ్డారు. దేశంలో 2లక్షల 69వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
ఇక ఇటలీలో కరోనా విస్తృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 33వేల మంది వైరస్ బారిన పడి మరణించారు. 2లక్షల 31వేల మందికి వైరస్ సోకింది. 1 లక్ష 50వేల మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రాన్స్ లోను మృతుల సంఖ్య 28వేలు దాటింది. కేసులు సంఖ్య 1లక్ష 86వేలు పైగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 67వేల మంది వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ప్రపంచంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్నిప్రాంతాల్లో విజృంభిస్తూ భయాందోళనకు గురిచేస్తోంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







