దోహా:కరోనా కట్టడికి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఖతార్ ఆరోగ్య శాఖ

- May 30, 2020 , by Maagulf
దోహా:కరోనా కట్టడికి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఖతార్ ఆరోగ్య శాఖ

దోహా:ఖతార్ లో కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. వైరస్ పురోగతిలో నిన్న చెప్పుదగ్గ క్షీణత కనిపించింది. అయితే..కరోనా వ్యాప్తిని మరింత కట్టుదిట్టంగా కట్టడి చేసేందుకు ఖతార్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఆస్పత్రులలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. అల్ తుమామామ్, అల్ వాబ్, లీబాయిబ్ ఆరోగ్య కేంద్రాలలో స్వాబ్ హబ్‌ల ద్వారా తాము ఫోన్ ద్వారా అహ్వానించిన వారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. తాము ఫోన్ చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించిన వారికి మాత్రమే అపాయింట్మెంట్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. వృధ్దులు, కరోనా కారణంగా హై రిస్క్ లో ఉన్న వారిని గుర్తించి వారికి ప్రధాన్యతను ఇస్తామని కూడా అధికారులు వెల్లడించారు. 

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com