ఎక్స్‌పో-2020 దుబాయ్‌.. ఏడాది తర్వాతే

- May 30, 2020 , by Maagulf
ఎక్స్‌పో-2020 దుబాయ్‌.. ఏడాది తర్వాతే

దుబాయ్‌: వరల్డ్‌ ఎక్స్‌పో అవార్డింగ్‌ బాఈ, జనరల్‌ అసెంబ్లీలో ఎక్స్‌పో2020 దుబాయ్‌ని ఏడాదిపాటు పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 అక్టోబర్‌లో దీన్ని నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించడంలేదని నిర్వాహకులు తెలిపారు. ఐదేళ్ళకోసారి సుమారు ఆరు నెలలపాటు ఈ బిజినెస్‌ మరియు కల్చరల్‌ గేదరింగ్‌ జరుగుతుంటుంది. బిఐసి సెక్రెటరీ జనరల్‌ దిమిత్రి ఎస్‌ కెకెంట్‌జెస్‌ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేనందున యూఏఈ ప్రభుత్వం అలాగే మెంబర్‌ స్టేట్స్‌ తాజా పరిస్థితుల్ని అంచనా వేసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. యూఏఈ గత మార్చ్‌లోనే పోస్ట్‌పోన్‌మెంట్‌పై సభ్య దేశాలకు ప్రతిపాదనలు పంపింది కరోనా వైరస్‌ కారణంగా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com