సౌదీ ఏవియేషన్‌ అథారిటీ ట్రావెల్‌ గైడ్‌లైన్స్‌ జారీ

- May 30, 2020 , by Maagulf
సౌదీ ఏవియేషన్‌ అథారిటీ ట్రావెల్‌ గైడ్‌లైన్స్‌ జారీ

రియాద్‌: జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (జిఎసిఎ), ట్రావెలర్స్‌ గైడ్‌ని విడుదల చేసింది. ఆదివారం నుంచి డొమెస్టిక్‌ విమానాలు సౌదీలో పునఃప్రారంభం కానున్న దరిమిలా ఈ గైడ్‌ని విడుదల చేయడం జరిగింది. ఈ గైడ్‌లో ఎయిర్‌పోర్టుల వద్ద ప్రికాషనరీ మెజర్స్‌ సహా అనేక భద్రతాపరమైన రూల్స్‌ని పొందుపర్చారు. ప్రయాణీకులు కోవిడ్‌ సింప్టమ్స్ వుంటే ఆ వివరాల్ని ముందుగానే తెలియజేయాల్సి వుంటుంది. డిజిటల్‌ పేమెంట్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుంది. ఎయిర్‌పోర్టుల్లో టిక్కెట్‌ ఔట్‌లెట్స్‌ మూసివుంటాయి. డిపాచ్యూర్‌కి రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి. ఎంట్రన్స్‌ వద్దనే చేతుల్ని స్టెరిలైజ్‌ చేసుకోవాలి. థర్మల్‌ చెక్‌ ద్వారా లోపలికి వెళ్ళాలి. మాస్క్‌లు అలాగే గ్లోవ్స్‌ ధరించాల్సి వుంటుంది. ఓ వ్యక్తి ఓ క్యారీ ఆన్‌ లగేజ్‌ మాత్రమే తీసుకెళ్ళడానికి అనుమతిస్తారు. సేఫ్‌ డిస్టెన్స్‌ ఖచ్చితంగా మెయిన్‌టెయిన్‌ చేయాలి. ఇలా పలు నిబంధనల్ని ట్రావెల్‌ గైడ్‌లో పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com