గ్యాస్‌ సిలెండర్‌ పేలుడు: అల్‌ సెహ్లాలో ఓ వ్యక్తి మృతి

- May 30, 2020 , by Maagulf
గ్యాస్‌ సిలెండర్‌ పేలుడు: అల్‌ సెహ్లాలో ఓ వ్యక్తి మృతి

మనామా:అల్‌ సెహ్లాలోని ఓ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో జరిగిన గ్యాస్‌ సిలెండర్‌ పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందారు. కిలోమీటర్‌ మేర ఈ పేలుడు తాలూకు శబ్దం విన్పించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ ఘటనను ధృవీకరించింది. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. మృతుడి వయసు 39 ఏళ్ళు. మృతుడు ముహమ్మద్‌ జిన్నా పదేళ్ళుగా శాంటీ ఎవాక్యువేషన్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనిచేస్తున్నట్లు తేల్చారు. డాక్యుమెంట్‌  కంట్రోలర్‌గా ఆ సంస్థలు మృతుడు పనిచేస్తున్నట్లు కంపెనీ ఎండీ రమేష్‌ రంగనాథన్‌ చెప్పారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com