10,000 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందజేసిన జగపతి బాబు
- May 30, 2020
హైదరాబాద్:కరోన వ్యాప్తి నిర్మూలనలో భాగంగా విధించిన లాక్‌డౌన్ వల్ల దినసరి వేతనం పొందే ఎంతో మంది సినీ కార్మికులు, పేదలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు వారికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇటీవల విలక్షణ నటుడు జగపతిబాబు చాలా మంది సినీ కార్మికులకు తనే స్వయంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించారు. అలాగే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ని పకడ్భందీగా నిర్వహిస్తున్న పోలీసులకి గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విషయం తెలిసిందే. ఇవే కాకుండా ఇటీవల ఇబ్బందులలో ఉన్న పదివేల మంది పేదలకి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను అందజేశారు అని తెలిసింది. ఇదే విషయాన్ని జగపతి బాబుని అడగగా `` సహాయం చేసిన మాట వాస్తవమే కాని చేసిన ప్రతి సహాయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా... ఆపదలో ఉన్న వారికి సహాయం చేశాను` అని ఎంతో సింపుల్‌గా, హంబుల్‌గా చెప్పారు.
జగపతిబాబు తండ్రి ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ కూడా ఎన్నో గుప్తదానాలు చేసేవారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా అందరి ఆదరాభిమానాల్ని అందుకున్న జగపతి బాబు కష్టాల్లో ఫ్యామిలీస్ ని ఆదుకోవడం ఎంతయినా అభినందించాల్సిన విషయం.
తాజా వార్తలు
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!