దుబాయ్ లో భారతీయుడి ఘరానా మోసం
- May 31, 2020
దుబాయ్: వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన ఎందరో భారతీయులు ఇప్పటికే స్వదేశానికి చేరారు. వైద్యపరంగా, ఉపాధి కోల్పోయిన, గర్భిణీలకు మొదట ప్రాధాన్యత ఇవ్వటం జరిగుతోంది. కానీ ఓ ఘరానా మోసగాడు భారీ మోసం చేసి వందే భారత్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన విమానంలో హైదరాబాద్ పారిపోయాడు. వివరాల్లోకి వెళితే..
ముంబై కు చెందిన యోగేశ్ అశోక్ యారియావా (36) 'రాయల్ లక్ ఫుడ్‌స్టఫ్ ట్రేడింగ్' అనే కంపెనీని స్థాపించి పలు వ్యాపారాలు పోస్ట్-డేటెడ్ చెక్కులతో పెద్ద కుంభకోణమే చేసాడు. దాదాపు ఆరు మిలియన్ల దిర్హాముల విలువైన వస్తువులను దొంగలించి, దుకాణాన్ని మూసివేసి, భారత్ పారిపోగా అతన్ని నమ్మిన వ్యాపారవేత్తలు తలలు పట్టుకొని కూర్చున్నారు. మే 11 న వందే భారత్ మిషన్ ఆధ్వర్యంలో అబుధాబి నుంచి హైదరాబాద్‌కు యోగేష్ వెళ్ళాడు. అతని తప్పనిసరి రెండు వారాల నిర్బంధ కాలం మే 25 తో ముగించగా బాధితులు తమ న్యాయ పోరాటం ప్రారంభించారు. ఇప్పటివరకు బాధితులు అందించిన వివరాల ప్రకారం యోగేశ్ కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు..
స్కైడెంట్ మెడికల్ ఎక్విప్మెంట్, రహీక్ లాబొరేటరీస్ మరియు జిఎస్ఎ స్టార్ నుండి దాదాపు అర మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఫేస్‌మాస్క్‌లు, హ్యాండ్ సానిస్టర్లు మరియు మెడికల్ గ్లోవ్స్; అల్ బరాకా ఫుడ్స్ నుండి Dh393,000 విలువ గల బియ్యం మరియు నట్స్; ఎస్ బయ్ జనరల్ ట్రేడింగ్ నుండి Dh300,725 విలువ గల ట్యూనా, పిస్తా మరియు కుంకుమ పువ్వు ; మెహడు జనరల్ ట్రేడింగ్ నుండి Dh229,000 విలువ గల ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు మోజారెల్లా జున్ను; అల్ అహ్‌బాబ్ జనరల్ ట్రేడింగ్ నుండి Dh207,000 విలువ గల ఫ్రోజెన్ గొడ్డు మాంసం, మరియు ఎమిరేట్స్ సెసేమ్ ఫ్యాక్టరీ నుండి Dh52812 విలువ గల హల్వా, తహినా కొనుగోలు చేయటం జరిగింది.
వ్యాపారులు యోగేష్ ఇచ్చిన పోస్ట్-డేటెడ్ చెక్కులు బౌన్స్ అవ్వడంతో బిజినెస్ బేలోని రాయల్ లక్ యొక్క ఒపల్ టవర్ కార్యాలయానికి వెళ్లారు. కానీ అప్పటికే ఆ ఆఫీసు మూసివేయటం, అందులోని 18 మంది సిబ్బంది అదృశ్యమవ్వటం జరిగిపోయింది. అంతేకాకుండా యోగేష్ గోడౌన్ లు ఖాళీగా ఉండటంతో ఉలిక్కిపడ్డ వ్యాపారులు తాము ఇప్పటివరకు సంప్రదింపులు జరుపుతున్న యోగేష్ ఉద్యోగులకు ఫోన్లు చేయగా ఎటువంటి సమాధానం అందలేదు. దీంతో ఆరా తీసిన వ్యాపారులు యోగేష్ వందే భారత్ మిషన్ ద్వారా హైదరాబాద్ కు వెళ్ళిపోయినట్టు తెలుసుకున్నారు. వెంటనే వారు బర్ దుబాయ్ లోని పోలీసు స్టేషన్ లో యోగేశ్ పై కేసు పెట్టారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి కాన్సుల్ జనరల్ విపుల్‌తో తమ గోడు చెప్పుకున్నారు. భారతదేశం మరియు యూఏఈ లో ప్రధాన నిందితుడిగా మారిన యోగేశ్ అశోక్ యారియావా పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు షార్జాకు చెందిన యునైటెడ్ అడ్వకేట్స్ నుండి న్యాయ సలహాదారు సలాం పప్పినిసేరి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు