ఎఫ్.ఎన్.సి.సి ఉద్యోగస్తులకు వెంకట గోవిందరావు నిత్యావసర సరుకుల సాయం

- May 30, 2020 , by Maagulf
ఎఫ్.ఎన్.సి.సి ఉద్యోగస్తులకు వెంకట గోవిందరావు నిత్యావసర సరుకుల సాయం

హైదరాబాద్:ఈ లాక్ డౌన్ సమయంలో ఆదుకునేందుకు పలు సంస్థలు..సెలబ్రిటీలు ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ లో వర్క్ చేసే ఉద్యోగస్తుల అందరకి ఫిల్మ్ నగర్ కల్చరర్ సభ్యుడు వెంకట గోవిందరావు  తమ సాయి ఏ. జి. ఎన్. సేవా ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను అందజేశారు. వాటితో పాటు సైఫ్ సైడ్ గా మాస్కులు..డెటాయిల్ సబ్బులను దాదాపు 140 మంది స్టాఫ్ కి అందజేసినట్లు వెంకట గోవిందరావుగారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ట్రెజరర్ తుమ్మల రంగారావు కమిటీ సభ్యులు శైలజ, ఏడిద రాజా వేణుగోపాల కృష్ణంరాజు, డి. వి. ఆర్. కె. ప్రసాద్ తో పాటు సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట గోవిందరావు మాట్లాడుతూ" లాక్ డౌన్ వేళ ఇబ్బందులు పడుతోన్న వారికి తమవంతుసాయాన్ని అందజేయాలని సెక్రటరీ కేఎస్ రామారావు గారిని..ఫిల్మ్ నగర్ కల్చరర్ మేనేజ్ మెంట్ వారి సహకారంతో ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ అందరికి నిత్యావసర వస్తువులను అందజేశానని చెప్పారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన వారందకి ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ అధైర్య పడొద్దు.. అందరూ మనోధైర్యాన్ని పెంచుకుని..రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉంటే జీవితకాలంలో మనం పోగొట్టున్న వాటిని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని వెల్లడించారు. ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్టే సేఫ్..స్టే హోమ్..అందరూ దూరాన్ని పాటించి..చేతులను శుభ్రంగా కడుకుంటూ ఉండాలని" తెలియజేశారు. అనంతరం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఉద్యోగస్తులు అందరూ వెంకట గోవింద రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com