ఆంక్షల ఎత్తివేత తర్వాతే యూఏఈకి ఎన్ఆర్ఐల తరలింపు
- May 31, 2020
దుబాయ్:యూఏఈ వీసా కలిగిన ఎన్ఆర్ఐల కోసం భారత ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో తిరిగి యూఏఈ వెళ్లేందుకు తమకు పెద్ద సంఖ్యలో ప్రవాసీయుల నుంచి విన్నపాలు వస్తున్నాయని తెలిపింది. అయితే..ప్రవాసీయులను తమ దేశంలోకి అనుమతించే విషయంలో యూఏఈలో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. యూఏఈ ప్రవాసీయులపై ఆంక్షలను ఎత్తివేసిన తర్వాతే భారత్ లో ఉండిపోయిన యూఏఈ వీసాదారులు తిరిగి యూఏఈ వెళ్లేందుకు అవకాశం ఉంటుందని కూడా వివరించింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ యూఏఈ వీసాదారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇదిలాఉంటే..కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కావటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ వీసాదారులు..తిరిగి యూఏఈ వచ్చేందుకు ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి మే 18 నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అనుమతి పొందిన వారు జూన్ 1 నుంచి యూఏఈకి తిరుగు ప్రయాణం కావొచ్చని అంతర్జాతీయ సహకార, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం http://smartservices.ica.gov.ae.వెబ్ సైట్ లోని రెసిడెంట్స్ ఎంట్రీ పర్మిట్ లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఐసీఏ స్మార్ట్ సర్వీస్ సిస్టం ద్వారా మీరు ఈ మెయిల్ అడ్రస్ పంపించగానే మీకు వెరిఫికేషన్ ఈ మెయిల్ వస్తుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







