బహ్రెయిన్:గల్ఫ్ ఎయిర్ ద్వారా మే నెలలో 82 టన్నుల వైద్య సామాగ్రి దిగుమతి

బహ్రెయిన్:గల్ఫ్ ఎయిర్ ద్వారా మే నెలలో 82 టన్నుల వైద్య సామాగ్రి దిగుమతి

మనామా:కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా గల్ఫ్ ఎయిర్ తమ విశేష సేవలను అందించింది. ఏప్రిల్, మే నెలలో నిర్విరామంగా తమ సేవలను కొనసాగిస్తూ కరోనా కట్టడికి అవసరమైన వైద్య సామాగ్రిని వివిధ దేశాల నుంచి బహ్రెయిన్ కి చేర్చించింది. ఒక్క మే నెలలోనే భారత్ నుంచి దాదాపు 82టన్నుల వైద్య సామాగ్రిని బహ్రెయిన్ కు చేర్చింది. ఈ నెలలో భారత్ లోని పలు నగరాల నుంచి నాలుగు కార్గో విమానాలను గల్ఫ్ ఎయిర్ ఆపరేట్ చేసింది. ఔషధాలు, వైద్య సామాగ్రి, హైజెనిక్ ఉత్పత్తులను తరలించింది. ఈ ప్రక్రియలో నిన్న విశేష స్థాయి ఫీట్ ను కూడా గల్ఫ్ ఎయిర్ నమోదు చేసింది. చైనాలోని గువాంగ్జు నుంచి ఒకేసారి ఏకంగా 21 టన్నుల వైద్య సామాగ్రిని బహ్రెయిన్ కు తీసుకొచ్చింది. కార్గో విమానం పూర్తి స్థాయి సామార్ధ్యం వరకు లోడ్ చేయటం విశేషం. ఇక ఏప్రిల్ లో భారత్ లోని వివిధ నగరాలకు ఆరు కార్గో విమానాలను ఆపరేట్ చేసి 90 టన్నుల వైద్య సామాగ్రిని తరలించింది. 

 

Back to Top