చమురు సంక్షోభం: బ్యాక్ టు పెవిలియన్
- January 30, 2016
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో చమురు సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు వలసదారులపై పన్నులను భారీగా వేస్తున్నాయి గల్ఫ్ దేశాలు. ప్రత్యేకించి ఒమన్‌లో వలసదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పెరిగిన అద్దెలు, దాంతోపాటుగా అన్నీ ఖరీదైపోవడంతో తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని వలసదారులు అంటున్నారు. తిరువనంతపురంకి చెందిన అరునమ్ సింగ్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో నలుగురు సభ్యులుంటారనీ, ఇదివరకటి రోజుల్లో హ్యాపీగా లైఫ్ గడిచిపోయేదనీ, మారిన పరిస్థితుల్లో జీవనం కష్టంగా మారడంతో కుటుంబాన్ని తిరిగి ఇండియాకి పంపించేసి, తానొక్కడినే షార్జాలో ఉండిపోయినట్లు చెప్పాడు. చీఫ్ కోఆర్డినేటర్, దుబాయ్ ఎన్‌జీవో వ్యాలీ ఆఫ్ లవ్ సి.పి. మాథ్యూ మాట్లాడుతూ, ఇప్పటికే పలువురు ఇండియన్స్ స్వదేశానికి వెళ్ళిపోయారనీ, ఇంకొందరు ఇండియాకి తమ కుటుంబాల్ని పంపేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒమన్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన రూల్ ప్రకారం, జాబ్ కాంట్రాక్ట్స్ రద్దు చేసుకున్నవారు నిషేధిత సమయం వరకు తిరిగి ఒమన్‌లో ప్రవేశించేందుకు వీలు లేకపోవడం కూడా వలసదారులపై తీవ్ర ప్రభావం చూపినట్లు కాన్సుల్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చమురు సంక్షోభంతో కొన్ని దేశాలు భారీగా టాక్స్‌లు పెంచగా, మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. అన్ని దేశాలూ కలిసి వ్యాట్‌ని ఇంపోజ్ చేయాలనుకోవడంతో రానున్న రోజుల్లో గల్ఫ్ దేశాల్లో వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.గల్ఫ్ లో ప్రస్తుత పరిస్థితులు కి అద్దం పట్టే వార్త 'మా గల్ఫ్' వారి సౌజన్యం తో వాసుదేవ రావు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







