పూర్తివినోదాత్మకంగా రూపోందిన ఆదిత్యక్రియెషన్స - గుండమ్మ కథ ట్రైలర్ విడుదల
- June 01, 2020
ఆదిత్య క్రియెషన్స్ పతాకం పై లక్ష్మీ శ్రీవాత్సవ స్వీయ నిర్మాణంలో కృష్ణం రాజు దర్శకునిగా తెరకెక్కిన సినిమా గుండమ్మ కథ. ఈ చిత్రంతో ఆదిత్య హీరోగా, ప్రణవ్య లు హీరోయిన్ గా చేస్తున్నారు. అన్ని వర్గాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి నిర్మాతగా లక్ష్మీ శ్రీవాత్సవ ఓ వైపున నిర్మాణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపున స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. అంతేకాకుండా కృష్ణం రాజు తో కలిసి దర్శకత్వ భాద్యతలు కూడా నిర్వహించారు. అలనాటి గుండమ్మ కథ ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిందో అంతే స్థాయిలో ఈతరం ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే రీతిన లవ్, కామెడీ, సెంటిమెంట్ తదితర అంశాలతో కూడా సన్నివేశాలు తెరకెక్కించనట్లుగా చిత్ర బృందం తెలిపింది. గతంలో విడదుల చేసిన ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ కి సోషల్ మీడియాలో ఆదరణ లభించడంతో అదే ఉత్సహాంతో తాజాగా గుండమ్మ కథ ట్రైలర్ ని విడుదల చేశారు. అలానే కరోనా నేపథ్యంలో థియేటర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా
నిర్మాత, దర్శకులు లక్ష్మీ శ్రీవాత్సవ, కృష్ణంరాజులు మాట్లాడుతూ
అలనాటి గుండమ్మ కథ తరతరాలు తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఏ రీతిన అలరిస్తుందో అదే స్పూర్తితో అన్ని వర్గాల తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ మోడ్రన్ గుండమ్మ కథని రెడీ చేశాము. ఈ సినిమాతో ఆదిత్య హీరోగా, ప్రణవ్య హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో జబర్థస్థ్ ఫేమ్ గెటెప్ శ్రీను కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోందని, ఫ్యామిలీతో హాయిగా చూసే సినిమాగా గుండమ్మ కథ ఉండబోతుంది అని అన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన థియేటర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా లక్ష్మీ శ్రీవాత్సవ తెలిపారు.
నటీ నటులు - ఆదిత్య, ప్రణవ్య, గెటెప్ శ్రీను, భాష తదితరులు
టెక్నీషియన్లు
కెమెరా - మోనీష్ భూపతి
ఎడిటర్ - ప్రవీణ్ పూడి
మ్యూజిక్ - సతీష్ సాధన్
కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే - లక్ష్మీ శ్రీవాత్సవ
నిర్మాత - లక్ష్మీ శ్రీవాత్సవ
దర్శకత్వం - లక్ష్మీ శ్రీవాత్సవ, కృష్ణం రాజు
బ్యానర్ - ఆదిత్య మూవీస్
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు