'దండకారణ్యం' త్వరలో..
- January 31, 2016
ఆ ర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన చిత్రం 'దండకారణ్యం'. త్రినాథ్, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్ ప్రధాన పాత్రధారులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నారాయణమూర్తి మాట్లాడుతూ ''త్రేతాయుగంలో సీతారాములకు, ద్వాపర యుగంలో పాండవులకు స్థావరం కల్పించింది దండకారణ్యమే.అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకొంది. బాక్సైట్ తవ్వకాలతో అక్కడున్న ఆదివాసీలకు మనుగడ లేకుండాపోతోంది. ఆ విషయాల్ని మా సినిమాతో తెరపై ఆవిష్కరించాం. మొత్తం ఏడు పాటల్లో మూడింటిని గద్దర్ ఆలపించారు. బొబ్బిలి, అరకు, విజయనగరం, పాల్వంచ, పాపికొండల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. ఛాయాగ్రహణం: శివకుమార్, సాహిత్యం: గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి, కాశీపతి
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







