కువైట్:కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ 50 వేల ఫ్రీ టికెట్లు..జజీరా ఎయిర్ వేస్ ఆఫర్

- June 03, 2020 , by Maagulf
కువైట్:కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ 50 వేల ఫ్రీ టికెట్లు..జజీరా ఎయిర్ వేస్ ఆఫర్

కువైట్:కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కువైట్ ప్రైవేట్ ఎయిర్ వేస్ జజీరా ఆఫర్ ప్రకటించింది. వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఉచితంగా 50 వేల టికెట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. జజీరా ఎయిర్ వేస్ సర్వీసుల్లో వారు ఎక్కడికైనా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. వచ్చే ఏడాది చివరి వరకల్లా ఈ ఆఫర్ ను వినియోగంచుకోవచ్చని జజీరా ప్రకటించింది. కరోనాపై పోరాడి దేశ ప్రజలను రక్షించటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించటం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు జజీరా ఎయిర్ వేస్ చైర్మన్ మర్వన్ బూదై అభిప్రాయపడ్డారు. అయితే...కువైట్ ప్రభుత్వం ఎంపిక చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే ఫ్రీ టికెట్లను కేటాయించనుంది. ప్రస్తుతం కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోందని, సర్వీసులు పునరిద్ధరించగానే టికెట్లను వినియోగంచుకోవచ్చని కూడా మర్వన్ స్పష్టం చేశారు. ఇదిలాఉంటే జజీరా ఎయిర్ వేస్ ప్రస్తుతం విదేశాల్లో చిక్కుకుపోయిన కువైటీయన్లను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com