బహ్రెయిన్ : అక్రమంగా నర్సుల రిక్రూట్మెంట్..కన్సల్టెన్సీ ఆఫీస్ సీజ్
- June 03, 2020
మనామా:ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవ్యతిరేకంగా నర్సులు, ఫిజియోథెరపిస్ట్ ల నియామకాలను చేపడుతున్న ఓ ఆఫీస్ పై జాతీయ ఆరోగ్య నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాజధాని గవర్నరేట్ పరిధిలో ఓ మహిళ అక్రమంగా రిక్రూట్మెంట్లు చేపడుతున్నట్లు గుర్తించి ఆఫీస్ ను సీజ్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన మహిళ అసియా దేశాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తాము సోదాలు నిర్వహించిన సమయంలో సదరు మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు జాతీయ ఆరోగ్య నియంత్రణ అధికార విభాగం అధిపతి డాక్టర్ హెస్స అల్ దొస్సరి వివరించారు. తాము తనిఖీలు నిర్వహించిన సమయంలో కింగ్ డమ్ లో నర్సుగా పని చేసేందుకు ఎలాంటి అనుమతులు లేని ఓ మహిళ నర్సుతో నిందితురాలు డీల్ చేస్తున్నట్లు తెలిపారు. ఆఫీస్ ను సీజ్ చేసి కేసును న్యాయవిచారణకు బదిలి చేసినట్లు వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







