శుక్రవారం ప్రార్ధనల పునరుద్ధరణను వాయిదా వేసిన బహ్రెయిన్
- June 04, 2020
మనామా:జూన్ 5 నుంచి శుక్రవారం ప్రార్ధనలను అనుమతించాలన్న నిర్ణయాన్ని బహ్రెయిన్ ప్రభుత్వం వాయిదా వేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారుల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 5(శుక్రవారం) నుంచి మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతించాలని ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే..కరోనా వైరస్ తీవ్రతపై సమీక్షించుకున్న ఉన్నతాధికారులు ఈద్ ప్రార్ధనల తర్వాత వైరస్ వ్యాప్తి పెరిగినట్లు నిర్ధారించుకుంది. అలాగే త్రైపాక్షిక సమావేశాల సూచనలు, వ్యాధి తీవ్రత నేపథ్యంలో మసీదుల్లో ప్రార్ధనలపై మరికొద్ది రోజులు వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించుకుంది. దీంతో జూన్ 5 నుంచి శుక్రవారం ప్రార్ధనలను పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు సామూహిక ప్రార్ధనలపై నిషేధం అమలులో ఉండనుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







