అబుధాబి:ఎతిహాద్ ఎయిర్ వేస్ ఉద్యోగులపై కరోనా ఎఫెక్ట్...

- June 05, 2020 , by Maagulf
అబుధాబి:ఎతిహాద్ ఎయిర్ వేస్ ఉద్యోగులపై కరోనా ఎఫెక్ట్...

అబుధాబి:ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగాన్ని కోవిడ్ 19 కుదిపేస్తోంది. ప్రస్తుత సంక్షోభాన్ని గట్టెక్కేందుకు ఎయిర్ వేస్ సంస్థలను తమ ఖర్చులను తగ్గించేందుకు అవకాశామున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. అబుధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్ వేస్ సంస్థ ఖర్చులను తగ్గించుకునేందుకు సెప్టెంబర్ వరకు ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి గత ఏప్రిల్ నెల నుంచి ఎతిహాద్ ఉద్యోగుల బేసిక్ శాలరీలో 25 నుంచి 50 శాతం కోత విధిస్తూ వస్తున్నారు. అయితే..కోవిడ్ 19 ప్రభావం విమానయానరంగంపై ఇంకొన్ని నెలల పాటు కొనసాగే అవకాశాలు ఉండటంతో జీతాల్లో కోతను సెప్టెంబర్ వరకు కొనసాగించాలని సంస్థ నిర్ణయించింది. సంస్థలో పని చేసే ఉద్యోగుల స్థాయిని బట్టి వేతనాల్లో కోతలను అమలు చేస్తోంది. దీని ప్రకారం క్యాబిన్ క్రూ, జూనియర్ స్టాఫ్ వేతనాల్లో 25 శాతం కట్ చేస్తోంది సంస్థ. అలాగే మేనేజర్ స్థాయి, అంతకుమించి హోదాల ఉన్న వారి జీతాల్లో 50 శాతం కోత విధిస్తున్నారు. అయితే..హౌజ్ అలెవెన్స్, ఇతర ప్రయోజనాలను యధావిధిగా కొనసాగిస్తోంది.  ప్రస్తుతం ఎతిహాద్ ఎయిర్ వేస్ లో దాదాపు 20,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తమ సంస్థలో శ్రామికశక్తి పట్ల తాము ఎప్పుడు గర్వపడుతామని, అయితే..ప్రస్తుత సంక్షోభంలో వారిని ఉద్యోగాల నుంచి తొలగించకుండా...సంస్థ నష్టాలను తగ్గించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందులోభాగంగానే సిబ్బంది వేతనాల్లో కోత విధించకతప్పని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com