కువైట్ కు కరోనా వ్యాక్సిన్ ఎవిగన్..వచ్చేవారం సరఫరా చేయనున్న జపాన్
- June 06, 2020
కువైట్ సిటీ:కరోనా డ్రగ్స్ 'ఎవిగన్' ను కువైట్ కు సరఫరా చేయనుంది జపాన్. వచ్చే వారంలో కరోనా డ్రగ్స్ తమ దేశానికి చేరుకుంటాయని కువైట్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు దేశాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో జపాన్ నుంచి ఎవిగన్ ను దిగుమతి చేసుకుంటామని కూడా తెలిపింది. అయితే..మాత్రల సరఫరా వాణిజ్య విలువలకు లోబడి కాకుండా కేవలం మానవతాధృక్పథంతో జపాన్ ఎవిగన్ ను సరఫరా చేస్తోందని కూడా మంత్రిత్వశాఖ వివరించింది. జపాన్ రూపొందించిన మార్గనిర్దేశకాలు, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు మెడిసిన్ ను వినియోగించనున్నారు. జపాన్ నుంచి మెడిసిన్ దిగుమతి చేసుకునేలా విశేషంగా కృషి చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు టోక్యోలోని కువైట్ రాయాబార కార్యాలయ అధికారుల సేవలను ఈ సందర్భంగా కువైట్ ప్రభుత్వం ప్రశంసించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?