11 వేల మంది ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సౌదీ న్యాయస్థానాలు
- June 06, 2020
రియాద్:గత కొద్ది రోజులుగా సౌదీ అరేబియాలో అమలు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్ విచారణ విజయవంతంగా అమలు అవుతోంది. సౌదీ అరేబియాలోని పలు గవర్నరేట్ పరిధిలో దాదాపు 11,052 మంది ఖైదీలను విచారించాయి న్యాయస్థానాలు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కోర్టులకు ఖైదీలను తరలించేందుకు బదులుగా జైలు నుంచే రిమోట్ సిస్టం ద్వారా గత కొద్ది రోజులుగా విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఖైదీలను జైలు నుంచి కోర్టులకు తరలించే సమయాన్ని, ఖర్చును కూడా ఆదా చేయగలుతున్నట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ గవర్నరేట్ పరిధిలోని జైళ్లలో వీడియో కాన్ఫరెన్స్ కు అవసరమైన సాంకేతికను సిద్ధం చేశామని, అలాగే భాషపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టాన్స్ లేటర్ వ్యవస్థను కూడా సాంకేతికకు జతచేసినట్లు వెల్లడించారు. ఖైదీలు వేలిముద్రల ద్వారా వారికి సంబంధించి వివరాలు కోర్టుకు చేరుతాయని కూడా వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?