సల్మాన్‌బాద్‌ గ్యాస్‌ స్టేషన్‌లో దొంగతనం: ముగ్గురి అరెస్ట్‌

- June 06, 2020 , by Maagulf
సల్మాన్‌బాద్‌ గ్యాస్‌ స్టేషన్‌లో దొంగతనం: ముగ్గురి అరెస్ట్‌

మనామా: బహ్రెయినీ పోలీస్‌, ముగ్గురు బహ్రెయినీ వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. సల్మాబాద్‌ టౌన్‌లోని ఓ పెట్రోల్‌ స్టేషన్‌లో నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్‌లో ఓ వర్కర్‌ని కొట్టి, కట్టి పడేశారనీ, అనంతరం దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు రాగానే, రీసెర్చ్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించామనీ, అనుమానితుల్ని గుర్తించి, వారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు నార్తరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com