131 కిలోల డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ గుట్టురట్టు చేసిన కువైట్‌

- June 06, 2020 , by Maagulf
131 కిలోల డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ గుట్టురట్టు చేసిన కువైట్‌

కువైట్ సిటీ:131 కిలోల హాషిష్‌ (డ్రగ్స్‌) సముద్ర మార్గంలో స్మగ్లింగ్‌ అవుతుండగా, ఆ ప్రయత్నాన్ని కోస్ట్‌ గార్డ్‌ భగ్నం చేసినట్లు కువైట్‌ ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెల్లడించింది. కోస్ట్‌ గార్డ్‌ సెట్రోల్స్‌, ఓ అనుమానిత బోటుని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారనీ, ఈ బోటులో నలుగురు వ్యక్తులున్నారనీ అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా నిందితులు, నార్కోటిక్స్‌ని నీటిలోకి డంప్‌ చేసినట్లు అంగీకరించారు. కువైట్‌లోనే ఓ పౌరుడికి డెలివరీ చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్లు నిందితులు పేర్కొన్నారు. నిందితుల్ని అలాగే స్వాధీనం చేసుకునన డ్రగ్స్‌ని సంబంధిత అథారిటీస్‌కి అప్పగించారు. అనుమానితుడైన సిటిజన్‌ని కూడా అరెస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com