'బొంబాట్' రెండో లిరికల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ’ విడుదల
- June 06, 2020
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై `ఈనగరానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘవేంద్ర వర్మ(బుజ్జి) దర్శకత్వంలో విశ్వాస్ హనూర్‌కర్ నిర్మిస్తున్న చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండో లిరికల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ’ను శుక్రవారం విడుదల చేశారు.
‘‘బుద్ధిగా కలగన్నాబుజ్జిగా ఎదపైన
సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిరా
అన్నీ దిక్కులలోన ఆక్సిజన్ జడివాన ...
స్వామినాథ’’
అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ లవ్ సాంగ్. ఈ పాటను ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి రాయగా జోష్.బి సంగీతం అందించారు. చందన బాల కల్యాణ్, కార్తీక్, హరిణి ఇవటూరి పాటను ఆలపించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!