కరోనా కట్టడికి జెడ్డాలో మళ్లీ కర్ఫ్యూ విధించిన సౌదీ అరేబియా
- June 06, 2020
రియాద్:కరోనా తీవ్రత మళ్లీ పెరిగిపోతుండటంతో ఎర్ర సముద్ర నగరం జెడ్డాలో మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తోంది సౌదీ అరేబియా. సిటీలో మళ్లీ కర్ఫ్యూను విధిస్తూ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి వచ్చే రెండు వారాల పాటు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ రెండు వారాల పాటు జెడ్డా నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఆఫీసుల నుంచి విధుల నిర్వహించకూడదని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే వారికి మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, కేఫ్ లు మూసివేయాలని ఆదేశించింది. అయితే..కర్ఫ్య లేని దేశీయ విమాన సర్వీసులు, ట్రైన్ సర్వీసులు యధావిధిగా కొనసాగిస్తామని కూడా వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు