జగన్ తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ ఈ నెల9న

- June 06, 2020 , by Maagulf
జగన్ తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ ఈ నెల9న

టాలీవుడ్ సినీ ప్రతినిధుల బృందం ఈనెల 9న ఏపీ సీఎం జగన్‌తో భేటీ కానుంది. మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసే ప్రతినిధి బృందంలో నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు ఉంటారు. ఈ భేటీకి నటుడు బాలకృష్ణను కూడా ఆహ్వానించినట్లు నిర్మాత సీ కళ్యాణ్‌ తెలిపారు.

పుట్టిన రోజు కారణంగా తాను రాలేనని బాలకృష్ణ అన్నట్లు కళ్యాణ్‌ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సీఎంతో చర్చించనున్నట్లు ప్రకటించారు సి.కళ్యాణ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com