కువైట్: 150KD కూపన్ల ఆఫర్ అంటూ ప్రచారం..కొట్టిపారేసిన లులు గ్రూప్
- June 06, 2020
కువైట్ సిటీ:కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో తమ సంస్థ 150KD కూపన్లను ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని లులు గ్రూప్ కొట్టిపారేసింది. తాము ఎలాంటి ఆఫర్లను ప్రకటించలేదని స్పష్టం చేసింది. కొందరు కేటుగాళ్లు తమ సంస్థ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని కూడా సంస్థ నిర్వాహకులు తెలిపారు. అతి సులభమైన ప్రశ్నలు అడుగుతూ వాటికి సమాధానం చెబితే 150KD కూపన్లు ఇస్తున్నట్లు ఇటీవల కొందరు మోసగాళ్లు మొబైల్ వినియోగదారులను బురిడి కొట్టిస్తున్నారు. లులు హైపర్ మార్కెట్ మంచి మార్కెట్ అని మీరు భావిస్తున్నారా? మీరు లులు మార్కెట్ ను మీ స్నేహితులకు, కుటుంబసభ్యులకు రిఫర్ చేస్తారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వెంటనే మరో లెవల్ పూర్తి చేయాలంటూ షరతు విధిస్తారు. ఈ రెండో టాస్క్ లో భాగంగా వాట్సాప్ లో 20 మంది మిత్రులకుగానీ, లేదా 5 గ్రూప్ లకు గానీ తమ మార్కెట్ గురించి మెసేజ్ చేయాల్సి ఉంటుందని చెబుతారు. అలా చేసిన వెంటనే లులు మార్కెట్ తరపున 150KD కూపన్లు వస్తాయని..వాటిని లులు హైపర్ మార్కెట్లో షాపింగ్ చేయవచ్చని ఆశ పుట్టిస్తారు. అయితే..తమ సంస్థ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు ప్రకటించటం లేదని..మోసగాళ్ల వలలో పడి ఎవరూ మోసపోవద్దని లులు సంస్థ వినియోగదారులకు స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







