ఇంటివద్దకే పెట్రోలు

- June 06, 2020 , by Maagulf
ఇంటివద్దకే పెట్రోలు

అబుధాబి: కరోనా ప్రభావముతో బయట తిరగాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒక్కోసారి కారులో పెట్రోలు నింపుకోవటానికి చాలా 'క్యూ' దర్శనమిస్తుంది. ఈ ఇబ్బంది లేకుండా అబుధాబి కి చెందిన అడ్నోక్ డిస్ట్రిబ్యూషన్, 'మై స్టేషన్' అనే సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.

ఇప్పటి నుండి, అబుదాబిలో నివసించేవారు ఈ యాప్ ద్వారా తమ వాహనాలకు ఇంటి వద్ద పెట్రోలు నింపుకోవచ్చు. ఈ మొబైల్ ఇంధన సేవను పొందటానికి కస్టమర్ తమకు అనువైన సమయం మరియు స్థానాన్ని ఎంచుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం అల్ రియాద్ నగరంలో అబుదాబి ఐలాండ్, అల్ మరియా, మరియు అల్ రీమ్ ద్వీపం లో ఉదయం 7 నుండి రాత్రి 11 వరకు అందుబాటులో ఉంది" అని అడ్నోక్ డిస్ట్రిబ్యూషన్ తెలిపింది.

నివాసితులు ఇంధనాన్ని ఆర్డర్ చేయడానికి 800-300 లేదా 0547929411 కు కాల్ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com