శౌర్య చిత్రం ఆడియో విడుదల...

- January 31, 2016 , by Maagulf
శౌర్య చిత్రం ఆడియో విడుదల...

మంచు మనోజ్‌, రెజీనా జంటగా దశరథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శౌర్య. వేద.కె స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి, తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలిసీడీని దర్శకులు బి.గోపాల్‌, ఎన్‌.శంకర్‌లకు అందించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు సతీమణి నిర్మల, మనోజ్‌ సతీమణి ప్రణతి, శ్రీవాస్‌, దశరథ్‌, శివకుమార్‌, రెజీనా, బ్రహ్మానందం, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com