సోనూసూద్ ఔదార్యం పై వ్వంగ్యాస్త్రాలు సంధించిన శివసేన
- June 07, 2020
లాక్‌డౌన్ సమయంలో వందలాది వలస కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించి.. యావత్ భారత్ మన్ననలు పొందిన సినీనటుడు సోనూ సూద్‌పై శివసేన మాత్రం తీవ్రంగా విరుచుకుపడింది. శివసేన అధికారిక పత్రిక సామ్నా వేదికగా పలు ప్రశ్నలు సంధించింది. కరోనా సమయంలో వచ్చిన కొత్త మహాత్మడు అంటూ సోనూ సూద్‌పై వ్వంగ్యాస్త్రాలు సంధించింది. అటు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సోనూ చేసిన సహాయంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారని.. అయితే, ఆ సమయంలో అన్ని బస్సులు ఎలా అందుబాటులోకి వచ్చాయని ప్రశ్నించారు. ఇంకా లాక్‌డౌన్‌లో ఏ రాష్ట్రంలో కూడా వలస కార్మికులను అనుమతించలేదని.. అయితే, వీరంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. ఆయన త్వరలో ప్రధాని మోదీని కలుస్తారని.. సెలబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబైగా మారిపోతారని సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆయన చేసిన పని చాలా మంచిదని.. దానిని మేము సమర్థిస్తామని.. కానీ, ఆయన వెనుక ఉన్న ఎవరో పొలిటిల్ డైరక్టర్ ఉండే ఉంటారని ఆరోపించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







