కువైట్:పౌర గుర్తింపు కార్డు లేకున్నా ప్రయాణించేందుకు ప్రవాసీయులకు అనుమతి

- June 07, 2020 , by Maagulf
కువైట్:పౌర గుర్తింపు కార్డు లేకున్నా ప్రయాణించేందుకు ప్రవాసీయులకు అనుమతి

కువైట్:దేశం విడిచి వెళ్లాలనుకునే ప్రవాసీయులు ఇక నుంచి పౌర గుర్తింపు కార్డులు లేకున్నా ప్రయాణించేందుకు కువైట్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే..చెల్లుబాటులో ఉన్న వారి నివాసిత అనుమతి పత్రాల్లోని లాటిన్ పేరుతో పాస్ పోర్ట్ వివరాలు సరిపోలాలని కూడా షరతు విధించింది. కరోనా నేపథ్యంలో కార్యాలయాల సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో పౌర గుర్తింపు కార్డులు ఇవ్వనందున కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి తగిన ఆదేశాలు కూడా జారీ చేసింది. పౌర గుర్తింపు కార్డులు లేకున్నా...చెల్లుబాటులో ఉన్న నివాస అనుమతి పత్రాలు, పాస్ పోర్టులోని వివరాలను సరిచూసుకొని ఎయిర్ పోర్టులోకి అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించింది. అయితే..ఇప్పటికే వివిధ దేశాల్లో ఉండిపోయిన ప్రవాసీయుల సివిల్ ఐడీ కార్డుల గడువు కూడా ముగిసిన విషయం తెలిసింది. అలాంటి వారు వివిధ దేశాల నుంచి కువైట్ కు వచ్చే వారి విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com