షార్జా:నకిలీ కాస్మోటిక్స్ సీజ్ చేసిన మున్సిపాలిటీ అధికారులు
- June 07, 2020
షార్జా:ఓ వాహనంలో తరలిస్తున్న కాలం చెల్లిన, నకిలీ కాస్మోటిక్స్ ను షార్జా మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. వినియోగదారుల భద్రతకు అధిక ప్రధాన్యం ఇస్తామని చెబుతున్న అధికారులు..ఇటీవల కాలంలో తనిఖీలను ముమ్మరం చేశారు. తమ తనిఖీల్లో భాగంగా ఓ అసియా వ్యక్తి వాహనాన్ని పట్టుకొని అందులో తరలిస్తున్న వస్తువులను తనిఖీ చేశామని పేర్కొన్నారు. వాహనం నిండా గడువు ముగిసిన కాస్మోటిక్స్, గుర్తింపు పొందని నకిలీ కాస్మోటిక్స్ ఉన్నట్లు గుర్తించామని, అందులో కొన్నింటిపై అరబిక్, ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలో లేబుల్స్ ఉన్నాయని అధికారులు వివరించారు. అంతేకాదు కాస్మోటిక్స్ సరఫరా చేసేందుకు అతనికి అనుమతి కూడా లేదని తెలిపారు. వినియోగదారుల ఆరోగ్య భద్రతకు సంబంధించి తాము కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా నకిలీ వస్తువులతో వినియోగదారులను మోసం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి నేరాలు మళ్లీ జరక్కుండా తగిన జరిమానా విధిస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?