సౌదీ అరేబియా నుంచి ఎన్ఆర్ఐలను భారత్ తరలించనున్న గల్ఫ్ ఎయిర్
- June 07, 2020
మనామా:సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను ఇండియా తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ లో గల్ఫ్ ఎయిర్ కూడా భాగస్వామ్యం కానుంది. ఈ మేరకు బహ్రెయిన్ కు చెందిన గల్ఫ్ ఎయిర్ ప్రతినిధులు..సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్ లోని చెన్నై, అహ్మదాబాద్, మంగళూరు, కొచ్చి విమానాశ్రయాలకు గల్ఫ్ ఎయిర్ సంస్థ తమ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. కరోనా సంక్షోభంలోనూ ఇప్పటికీ సేవలను అందిస్తున్న అతికొద్ది సంస్థల్లో గల్ఫ్ ఎయిర్ ఒకటి. వివిధ దేశాల్లోని పౌరులను, సరుకు రవాణాను చేరవేసేందుకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఇటీవలె లాహోర్ నుంచి రియాద్ కు 50 టన్నుల మాంసాన్ని కార్గో ఫ్లైట్ లో తరలించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు