మనామా:BD2,000 చోరీ..24 గంటల్లోనే ముగ్గురు నేరగాళ్ల అరెస్ట్
- June 07, 2020
మనామా:BD2,000 చోరికి పాల్పడిన కేసును 24 గంటల్లో పరిష్కరించారు బహ్రెయిన్ పోలీసులు. బహ్రెయిన్ లోని అసియా దేశాలకు చెందిన ఓ ప్రవాసీయుడి దగ్గర్నుంచి ముగ్గురు వ్యక్తులు BD2,000 దొంగిలించారు. ఈ ముగ్గురిలో ఒకరు అసియా దేశాలకు చెందిన వ్యక్తికాగ..మిగిలిన ఇద్దరిలో ఒకరు బహ్రెయిన్, మరొకరు అరబ్ దేశాలకు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. చోరీ జరిగినట్లు తమకు ఫిర్యాదు అందిన వెంటనే విచారణ ప్రారంభించామని, కేవలం 24 గంటల్లోనే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామని బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. చోరీ సొత్తును సీజ్ చేశామని, ముగ్గురు నిందితులను న్యాయ విచారణకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







