జనవరి 2021 నుంచి వలసదారులకు ఎంప్లాయర్ని మార్చుకునే వీలు
- June 08, 2020
ఒమాన్: జనవరి 21 నుంచి వలసదారులు, తమ ఎంప్లాయర్ని మార్చుకునే వీలు కలుగుతుంది. అయితే, కొన్ని షరతులను/నిబంధనలను వలసదారులు పూర్తి చేయాల్సి వుంటుంది. పోలీస్ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహ్సెన్ అల్ షారికి మాట్లాడుతూ ఎగ్జుక్యూటివ్ రెగ్యులేషన్స్ - రెసిడెన్స్ అండ్ ఫారినర్స్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు చేసినట్టు వెల్లడించారు. వలసదారులు తమ రెసిడెంట్ వీసాని ఒక ఎంప్లాయర్ నుంచి మరో ఎంప్లాయర్కి మార్చుకోవచ్చు. ఆధారాలతో సహా కాంట్రాక్టు గడువు/ కాంట్రాక్టు రద్దు ని నిరూపించాల్సి వుంటుంది. జనవరి 2021 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అవసరమైన అన్ని నిబంధనలను పాటించినప్పుడు, వలసదారు రెసిడెన్స్కి సంబంధించి మొదటి ఎంప్లాయర్ బాధ్యత చెల్లుబాటవుతుంది. ప్రస్తుతం వున్న విధానం ప్రకారం 'ఎన్ఓసి'ని సమర్పిస్తే ఓ కంపెనీ నుంచి మరో కంపెనీలోకి వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. లేదంటే, ఒమన్ ని విడిచి వెళ్ళి, రెండేళ్ల తర్వాత రావాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?