సౌదీ: డాక్టర్లకు కరోనా..హాస్పిటల్ మూసివేత
- June 08, 2020
సౌదీ: సౌదీలో నిబంధనలను సడలించి యధాతథ ప్రజాజీవనాన్ని ప్రోత్సహించగా పలు అవాంఛిత సంఘటనలు చోసుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఇమామ్ కు కరోనా సోకిందని మసీదును మూసివేశారు. ఇప్పుడు ఏకంగా ఒక ప్రైవేటు హాస్పిటల్ లోని డాక్టర్ కు కరోనా సోకగా ఆ హాస్పిటల్ ను మూసివేస్తున్నట్టు తాజా ప్రకటన.
సౌదీ అరేబియాలోని ఖోబార్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో అధిక సంఖ్యలో వైద్యులకు కరోనా సోకడంతో ఆ హాస్పిటల్ మూసివేయబడింది. కరోనా రోగులకు చికిత్స చేసి ఎటువంటి సామాజిక దూరం పాటించకుండా సహా ఉద్యోగులతో మెలగటంతో హాస్పిటల్ లోని ఎక్కువ సంఖ్య లో వైద్యులకు కరోనా సోకిందని తెలిపిన సౌదీ మీడియా. వ్యాప్తిని నియంత్రించడానికి మరియు పరిస్థితిని చక్కదిద్దుటకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది.
గత నెలలో మక్కాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మరియు ఒక నర్సు కరోనావైరస్ బారిన పడి మరణించటం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







