జూన్ 10న కువైట్ నుంచి ఇండియాకి తొలి చార్టర్డ్ ఫ్లైట్
- June 08, 2020
కువైట్ సిటీ:తొలి చార్టర్డ్ ఫ్లైట్ కువైట్ నుంచి ఇండియాలోని కోజికోడ్‌కి బయల్దేరనుంది. జూన్ 10న ఈ విమానం బయల్దేరనుంది. ఎన్నారై ఆర్గనైజేషన్ ఈ మేరకు చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తోంది. కువైట్ కేరళ ముస్లిం అసోసియేషన్ (కెకెఎంఎ) తమ తొలి చార్టర్డ్ విమానాన్ని జూన్ 10న కోజికోడ్‌కి ఏర్పాటు చేసింది. ఐటీఎల్ వరల్డ్ ట్రావెల్ కంపెనీతో కలిసి ఈ చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన అనుమతులు సంపాదించడం జరిగిందనీ, చార్టర్డ్ విమానంలో తొలి ప్రాధాన్యత ప్రెగ్నెంట్ మహిళలకు, సిక్ పర్సన్స్, వీసా గడువు తీరినవారికి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ఇండియాకి వెళుతున్నవారికి ఇవ్వనున్నారు. కేరళకే చెందిన మరో ఎన్నారై ఆర్గనైజేషన్ ‘కెఎఎల్‌ఎ) కూడా మరో చార్టర్డ్ విమానాన్ని కువైట్ ఎయిర్ వేస్‌తో కలిసి జూన్ 12న ఏర్పాటు చేస్తోంది. కాగా, ఓఐసిసి కువైట్ మరియు బదుర్ ట్రావెల్స్ సంయుక్తంగా మరో చార్టర్డ్ విమానాన్ని జజెరా ఎయిర్ వేస్ ద్వారా కోచికి జూన్ 12న ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?