బ్రిటీష్ పెట్రోలియం: 10,000 ఉద్యోగస్తులపై పడనున్న వేటు

- June 08, 2020 , by Maagulf
బ్రిటీష్ పెట్రోలియం: 10,000 ఉద్యోగస్తులపై పడనున్న వేటు

కరోనావైరస్ సంక్షోభం కారణంగా చమురు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా క్షీణించిన నేపథ్యంలో చమురు దిగ్గజం అయిన బ్రిటీష్ పెట్రోలియం 10,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ సంవత్సరం చివరినాటికి 15% మంది సంస్థను వదిలివెళ్తారని సిబ్బందికి తెలియజేసింది. యుకె లో షుమారు 2 వేల ఉద్యోగాలు పోతాయని భావిస్తున్నారు.

చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనీ సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో ఆయన ఇలా అన్నారు: "చమురు ధర మేము లాభాలను ఆర్జించాల్సిన స్థాయి కంటే బాగా పడిపోయింది. మేము సంపాదించడం కంటే చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాము."

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com