డిఫెక్టివ్‌ టైర్స్‌ అమ్మకం: వలసదారుడి అరెస్ట్‌

- June 08, 2020 , by Maagulf
డిఫెక్టివ్‌ టైర్స్‌ అమ్మకం: వలసదారుడి అరెస్ట్‌

మస్కట్‌: డిఫెక్టివ్‌ టైర్స్‌ విక్రయిస్తున్న ఓ వలసదారుడికి న్యాయస్థానం మూడు నెలల సస్పెండెడ్‌ ప్రిజన్‌ సెంటెన్స్‌ విధించినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ (పిఎసిపి) పేర్కొంది. అల్‌ ముసానా కోర్ట్‌ ఈ తీర్పు ఇచ్చినట్లు పిఎసిపి ఓ ప్రకటనలో వెల్లడించింది. పబ్లిక్‌ లా సూట్‌కి సంబంధించిన ఖర్చులు చెల్లించాలని కూడా నిందితుడికి న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. కాగా, డిఫెక్టివ్‌ టైర్స్‌కి సంబంధించిన ఖర్చులు కూడా నిందితుడు చెల్లించాల్సి వుంటుంది. కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ చట్టం - ఆర్టికల్‌ 25ని నిందితుడు ఉల్లంఘించాడని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com