ప్రికాషనరీ మెజర్స్‌ ఉల్లంఘన: 210 మందికి జరీమానా

- June 08, 2020 , by Maagulf
ప్రికాషనరీ మెజర్స్‌ ఉల్లంఘన: 210 మందికి జరీమానా

దుబాయ్:కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో పాటించాల్సిన ప్రికాషనరీ మెజర్స్‌ని పాటించని కారణంగా 210 మందికి జరీమానా విధించడం జరిగింది. దుబాయ్‌ బీచెస్‌ వద్ద ఈ జరీమానాలు విధించారు. బీచ్‌ సెక్యూరిటీ టీవ్స్‌ు, ఈ ఉల్లంఘనుల్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్‌ పోర్ట్స్‌ పోలీస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సయీద్‌ అల్‌ మదాని మాట్లాడుతూ, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించకపోవడం అలాగే ఫేస్‌ మాస్క్‌లను ధరించకపోవడానికి సంబంధించి ఎక్కువగా ఉల్లంఘనలు నమోదయినట్లు చెప్పారు. ఈ రెండు ఉల్లంఘనలకు 3,000 వరకు జరీమానా విధించే అవకాశం వుంది. కైట్‌ బీచ్‌ ప్రాంతంలో ఎక్కువగా శుక్రవారాల్లో జనం ఎక్కువ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com