బహ్రెయిన్:20 దినార్స్ కు ఆశపడి వ్యభిచార ముఠాకు చిక్కిన మహిళ
- June 09, 2020
మనామా:అప్పటికే ఆమె జీతం 100 బహ్రెయిన్ దినార్లు. కానీ, ఇంకో 20 దినార్లు ఎక్కువ జీతం ఇప్పిస్తానని మరో మహిళ మాయమాటలు గుడ్డిగా నమ్మింది. డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడింది. ఉద్యోగం ఇచ్చిన ఇంటి ఓనర్ చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి జంప్ అయ్యింది. కొత్త పని..ఎక్కువ జీతం అని కలలు కన్న ఆ అమ్మాయి..తీరా తను పని చేయాల్సిన చోటుకు వెళ్లి షాక్ అయ్యింది. 20 దినార్లకు ఆశపడి వెళ్లి ఆ అమ్మాయిని ఆ మాయదారి మహిళ వ్యభిచార రొంపిలోకి దింపింది. బహ్రెయిన్ లోని మనామాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆసియా దేశాలకు చెందిన ఓ మహిళా రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా బహ్రెయిన్ లోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగానికి కుదిరింది. 100 బహ్రెయిన్ దినార్లు ఆమె జీతం. అయితే..మూడు వారాలు గడిచాక బాధితురాలికి మరో మహిళతో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో బాధితురాలిని బుట్టలో వేసుకున్న సదరు మహిళ..ఇంతకంటే 20 దినార్లు ఎక్కువ జీతం ఇప్పిస్తానని, పైగా పని కూడా గంటల లెక్కన ఉంటుందని, రోజంతా కష్టపడాల్సిన అవసరం ఉండదంటూ నమ్మించింది. అయితే..ఓనర్ కు తెలియకుండా పారిపోయి రావాలని కూడా సూంచింది. 120 దినార్ల జీతం వస్తుందని, పని కూడా తక్కువ ఉంటుందని ఆశపడిన బాధితురాలు మహిళ ప్రతిపాదనకు అంగీకరించింది. దీంతో వ్యభిచార ముఠాలోని ఓ వ్యక్తి వచ్చి ఎవరికి తెలీకుండా ఆమెను తీసుకెళ్లాడు. వ్యభిచారం నిర్వహించే అపార్ట్మెంట్లలో ఇద్దరు మహిళల్ని, ఓ వ్యక్తిని పరిచయం చేసి ఆ రాత్రి విశ్రాంతి తీసుకోమన్నారు. తీరా తెల్లారాక బాధితురాలికి తను చేయాల్సిన విధుల గురించి చెప్పారు. రోజూ వచ్చే విటులను సంతోషపర్చాలంటూ బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారు. పారిపోయే అవకాశం కూడా లేకపోవటంతో దాదాపు వారం పాటు ఆమె అక్కడే నరకం అనుభవించింది. చివరికి ఎలాగోలా బహ్రెయిన్ లోని తమ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం చేరవేసింది బాధితురాలు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైడ్ చేసి వ్యభిచార ముఠా చెర నుంచి బాధితురాలిని రక్షించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇటీవలి కాలంలో వ్యభిచార ముఠాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది బహ్రెయిన్ ప్రభుత్వం. నేర తీవ్రతను బట్టి 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. అలాగే 10 వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించటంతో పాటు బాధితులను వారి స్వంత దేశాలకు తరలించేందుకు అవసరమైన ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బహ్రెయిన్ లో అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యభిచార ముఠా సభ్యులపై మానవ అక్రమ రవాణా, కిడ్నాప్, వ్యభిచార నిర్వహణకు సంబంధించి కేసులను నమోదు చేశారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..